మూలా నక్షత్రం.. దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:52 PM
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
విజయవాడ, అక్టోబర్ 15: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. రేపు(శుక్రవారం) సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారికి సీఎం దంపతులు పట్టువస్త్రాలు ఇవ్వనున్నారు. మరోవైపు మూలా నక్షత్రం సందర్భంగా రేపు అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలు కల్పించనున్నారు. సామాన్య భక్తులకు సులభంగా, వేగంగా ఉచిత దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
సాధారణ భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనాలు, ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. భక్తులందరికీ ముఖమండపం నుంచే శ్రీ సరస్వతీ దేవి అలంకార దర్శనం కల్పించనున్నారు. అలాగే రేపు కొండపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎటువంటి ప్రైవేటు వాహనాలను అనుమతించకూడదని ఆలయ అధికారులు నిర్ణయించారు. సర్వీస్ పాసులతో సహా ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల వాహన పాసులను తాత్కాలికంగా హోల్డ్లో ఉంచనున్నారు. అత్యవసర అధికారిక రవాణాకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
ఇవి కూడా చదవండి...
మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు పెంచాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళల భాగస్వామ్యం కీలకం: రాష్ట్రపతి ముర్ము
Read Latest AP News And Telugu News