Share News

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు పెంచాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్

ABN , Publish Date - Oct 15 , 2026 | 01:15 PM

మహిళల అభ్యున్నతిపై దృష్టి కేంద్రీకరించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉపాధి కల్పనను దాటి, లాభదాయకమైన, స్థిరమైన, విస్తరించదగిన మహిళా పారిశ్రామిక సంస్థలను నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు.

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ అవకాశాలు పెంచాలి: గవర్నర్ అబ్దుల్ నజీర్
Governor abdul nazeer

విజయవాడ, అక్టోబర్ 15: మహిళల అభ్యున్నతిపై దృష్టి కేంద్రీకరించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఈరోజు(గురువారం) పున్నమిఘాట్‌లో జాతీయ సరస్ మేళా ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఉపాధి కల్పనను దాటి, లాభదాయకమైన, స్థిరమైన, విస్తరించదగిన మహిళా పారిశ్రామిక సంస్థలను నిర్మించడంపై దృష్టి సారించాలన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు తగిన ఆర్థిక వసతులు, ఆధునిక సాంకేతికత, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు. నమ్మకమైన మార్కెట్ అనుసంధానాలు కల్పించడం ద్వారా వారి వ్యాపారాలను విస్తరించుకోవడానికి విస్తృత మార్కెట్లలో పోటీ పడేలా మద్దతునివ్వాలని అన్నారు.


ఈ సరస్ మేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ఎంతో మందికి మంచి అవకాశాలు కలిగిస్తుందని గవర్నర్ తెలిపారు. కేవలం సందర్శకుల సంఖ్య ఆధారంగానే కాకుండా, వ్యాపార అవకాశాలు, మార్కెట్ సంబంధాలు, వృద్ధి సామర్థ్యం, స్థిరమైన ఉపాధి అవకాశాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ‘సరస్ ఆజీవిక మేళా’ వంటి కార్యక్రమాలు గ్రామీణ ఉత్పత్తిదారులకు పట్టణ వినియోగదారులకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చగలవన్నారు.


మహిళల్లో పెట్టుబడి పెట్టడం అంటే బలమైన కుటుంబాలు, సమ్మిళిత సమాజాలు మరింత సుసంపన్నమైన దేశంలో పెట్టుబడి పెట్టడమే అని చెప్పుకొచ్చారు. మహిళా సాధికారత అంటే మహిళలను బలవంతులుగా మార్చడం కాదన్నారు. మహిళలు ఇప్పటికే బలంగా ఉన్నారని... ప్రపంచం ఆ బలాన్ని చూసే విధానాన్ని మార్చడమే సాధికారత అనేది గుర్తించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి మంత్రి అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు

అబ్దుల్ కలాం జయంతి.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివాళులు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 15 , 2026 | 01:28 PM