బందరు అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం.. పేర్నినానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:33 PM
మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బందరు అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా, సెప్టెంబర్ 24: మాజీ మంత్రి పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బందరు అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. బందరు అభివృద్ధిని, బందరు నాశనాన్ని కోరుకునే ఏకైక వ్యక్తి పేర్ని నాని అంటూ ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వ కృషి ఫలితంగా బందరుకు రూ.8 వేల కోట్లతో గోవా షిప్ యార్డ్ వస్తోందని తెలిపారు.
గోవా షిప్ యార్డ్ ఏర్పాటు ద్వారా 10వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. బలవంతంగా భూములు లాక్కుంటారని రైతుల్లో అలజడులు సృష్టించేలా పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులను బందరు ప్రజలు ఓ కంటి కనిపెట్టాలన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తరిమికొట్టినా పేర్ని నాని చిల్లరి రాజకీయాలు మానలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ ద్వారా 16,300 మందికి ఉద్యోగాలు ఇస్తే టీచర్లపై దాడి చేయించిన విష సంస్కృతి వైసీపీది అంటూ విరుచుకుపడ్డారు.
ఆనాడు తాము చేసిన పోర్టు ఉద్యమానికి సాక్షాత్తు వైఎస్ రాజశేఖరరెడ్డి దిగొచ్చారని మంత్రి గుర్తుచేశారు. తాము పోర్టు పనులు చేస్తే, జగన్ వచ్చాక పనులను నిలిపివేశారని వ్యాఖ్యానించారు. మళ్లీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోర్టు పనులను వేగవంతం చేశామన్నారు. 2027 మార్చి నాటికి పోర్టు పనులు పూర్తి కానున్నాయని తెలిపారు. పోర్టుకు అనుబంధంగా గోవా షిప్ యార్డ్ రాబోతుందని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు మచిలీపట్నానికి రానున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
డీఎస్సీ వివాదంపై అనిత ఫైర్.. జగన్ ఆరోపణలకు 16 వేల ఉద్యోగాలతో కౌంటర్
Read Latest AP News And Telugu News