మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:31 PM
విశాఖపట్నంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులతో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 24: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికారులతో కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అన్నారు. విద్యుత్, తాగునీరు, రహదారులను వెంటనే పునరుద్ధరించాలని తెలిపారు. పునరావాసం కల్పించిన చోట అన్ని వసతులను కల్పించాలని ఆదేశించారు. అలాగే, తాగునీటికాలుష్యం జరగకుండా చూడాలని చెప్పారు. భారీ వర్షం కారణంగా జరిగిన నష్టాల అంచనాలను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో గత మూడు రోజుల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని కలెక్టర్ తెలిపారు. 14 చోట్ల నీరు నిలిచిపోగా 10 చోట్ల క్లియర్ చేయడం జరిగిందన్నారు. వేర్వేరు చోట్ల 71 చెట్లు కూలిపోగా 61 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. ప్రతిచోట క్లోరినేషన్, శానిటేషన్ జరగాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. వేర్వేరు అంశాలపై 116 ఫిర్యాదులు అందగా 97 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించినట్లు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు
ఏపీ మద్యం రవాణా స్కాం.. అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
Read Latest AP News And Telugu News