Share News

జగన్‌ పాదయాత్ర ఏపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: యనమల

ABN , Publish Date - Sep 10 , 2026 | 09:50 AM

స్థానిక సంస్థలు అంత ముఖ్యమైనవి కావని జగన్ భావించడం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బతీసేలా ఉందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

జగన్‌ పాదయాత్ర ఏపీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే: యనమల
Yanamala Ramakrishnudu

అమరావతి, సెప్టెంబర్ 10: స్థానిక సంస్థలు అంత ముఖ్యమైనవి కావని జగన్ భావించడం క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలనే దెబ్బతీసేలా ఉందంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. దీనివల్ల వైసీపీ అధినేత ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతానని, తద్వారా తనకున్న అపఖ్యాతి మరింత పెరుగుతుందని భయపడే ఆ ఎన్నికలను ఎదుర్కోవడానికి వెనుకాడుతున్నారనే విషయం జగన్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేస్తున్నారని అన్నారు.


బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటూ వైసీపీ నేతలు కోర్టులో కేసులు వేశారని యనమల అన్నారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో సహా బీసీల సంక్షేమం పట్ల జగన్ ఎప్పుడూ ఆసక్తి చూపలేదని విమర్శించారు. గత వైసీపీ హయాంలో రిజర్వేషన్ల శాతాన్ని 34శాతం నుంచి 24శాతానికి తగ్గించినప్పుడు జగన్ మౌనంగా ఉండిపోయారని.. దీనివల్ల బీసీలు 10శాతం రిజర్వేషన్లను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మరోసారి మోసం చేయడం ద్వారా అధికారాన్ని దక్కించుకునేందుకే వచ్చే ఏడాది పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారని విమర్శించారు. ఈ పాదయాత్ర రాష్ట్ర లేదా ప్రజల శ్రేయస్సు కోసం కాదని.. కేవలం రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీయడానికే ఉద్దేశించినదంటూ యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

ఆ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్

డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 10 , 2026 | 09:55 AM