అడవిలో రాత్రంతా ఒంటరిగా..!
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:53 AM
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో నాలుగున్నరేళ్ల గిరిజన బాలుడు తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే 24 గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది.
అడవిని జల్లెడ పట్టి గుర్తించిన పోలీసులు
సీతంపేట, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో నాలుగున్నరేళ్ల గిరిజన బాలుడు తప్పిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే 24 గంటల వ్యవధిలోనే బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కథ సుఖాంతమైంది. కిండంగి పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామం గులుమూరుకు చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమారులు. మంగళవారం ఎప్పటిలానే రామ్మూరి కొండపోడు పనుల కోసం అడవికి బయలుదేరాడు. అది చూసిన పెద్ద కుమారుడు సిద్ధూ తండ్రి వెంటే గ్రామం దాటి అడవి ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. ఇది రామ్మూర్తి గమనించలేదు. ఇంట్లో సిద్ధూ కనిపించకపోవడంతో తల్లి మహేశ్వరి గ్రామస్థులతో కలిసి వెతుకులాట ప్రారంభించింది. ఫలితం లేకపోయింది. సీతంపేట పోలీస్ట్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. సీతంపేట పోలీసులు,స్పెషల్ ఫోర్స్ బృందం గులుమూరు సమీపంలో జల్లెడపట్టారు. చివరికి బుధవారం మధ్యాహ్నం ఆ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కొండపై బాలుడిని కనిపెట్టారు.
ఈ వార్తలనూ చదవండి..