మున్సిపాలిటీలో కొనసాగం
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:30 PM
‘మా గ్రామాన్ని రాజాం మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. మాకు మున్సిపాలిటీలో కొనసాగడం ఇష్టం లేదు.
- పంచాయతీయే కావాలి
-తేల్చిచెప్పిన కొత్తవలస గ్రామస్థులు
- ప్రజావేదిక నిర్వహించిన అధికారులు
రాజాం రూరల్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘మా గ్రామాన్ని రాజాం మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. మాకు మున్సిపాలిటీలో కొనసాగడం ఇష్టం లేదు. పంచాయతీయే కావాలి.’ అని కొత్తవలస గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఈ నెల 7న కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో గ్రామస్థులు అందించిన వినతి మేరకు బుధవారం సాయంత్రం గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. రాజాం తహసీల్దార్ రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, టౌన్ సీఐ నవీన్‌కుమార్, ఎంపీడీవో ఆనందరావు తదితరులు హాజరై గ్రామస్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల పన్నుల భారం అధికంగా పడుతుంది. ఉపాధి పనులు లేవు. చెరువులను సంరక్షించుకోలేకపో తున్నాం. అన్నింటికి పన్నులు చెల్లించా ల్సి వస్తుంది. రాజాం పట్టణానికి ఉపాధి కోసం వెళ్లినా పనులు దొరకడంలేదు. ఇంటి నిర్మాణ ప్లాన్ అనుమతుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరి స్థితుల మధ్య 21 ఏళ్లు గడిపాం. ఫలి తంగా తీవ్రంగా నష్టపోయాం. గ్రామ పంచాయతీ అయితే అనేక సౌకర్యాలు ఉంటాయి. పన్నుల భారం అంతగా ఉం డదు.’ అని గ్రామస్థులు వివరించారు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తప్పించాలని ముక్తకంఠంతో కోరారు. మీ అభిప్రాయాలు, సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ శిమ్మ జగన్నాథం, పెద్దలు ఉంగటి శంకర్, తవిటి నాయుడు, అసిరినాయుడు, పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు.
మా వార్డులను మున్సిపాలిటీలో ఉంచాలి
‘మేము కొత్తవలస పంచాయతీలో కొనసాగమని, మమ్మల్ని రాజాం మున్సిపాలిటీలో కొనసాగించాలని’ 15, 16, 17, 18 వార్డులకు చెందిన ప్రతినిధులు అధికా రులకు వినతిపత్రం అందజేశారు. 2005లో కొత్తవలస పంచాయతీని రాజాం నగర పంచాయతీలో విలీనం చేసినప్పటి నుంచి మా కాలనీలన్నీ అందులోనే కొనసా గుతున్నాయని వారు తెలిపారు. వాటిని మున్సిపాలిటీ లోనేఉంచాలని గోపాలపురం, యాతవీధి, మల్లయ్య పేట, లచ్చయ్యపేట, మెంటిపేట ఎస్సీ కాలనీ, అమ్మ వారికాలనీ, ఆదర్శనగర్, టీచర్స్ కాలనీ, ద్వారకానగర్, వస్త్రపురికాలనీ ప్రతినిధులు కోరారు.