Share News

వదలని ఏనుగులు

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:31 PM

జిల్లాను ఏనుగులు వదలడం లేదు.

వదలని ఏనుగులు
పెదమరికి ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు

-ఒడిశా సరిహద్దు నుంచి మళ్లీ రాక

- పెదమరికిలో సంచారం

పార్వతీపురం రూరల్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాను ఏనుగులు వదలడం లేదు. మంగళవారం సా యంత్రం కొమరాడ మండలం కోనవలస గ్రామ పరిసరా ల్లో సంచరించిన 8 ఏనుగులను కుంకీలు అభిమన్యు, జయంత్‌ల సమన్వయంతో ఒడిశాలోని రేపటిగూడ గ్రామ సరిహద్దులోకి అటవీశాఖ అధికారులు తరలించిన విషయం తెలిసిందే. ఒడిశా వెళ్లిపోయాయని, ఇక తమ పంటలకు నష్టం ఉండదని రైతులు ఆనందపడ్డారు. కానీ, ఒకరోజు కూడా కాకుండానే గజరాజులు తిరిగి జిల్లాలోకి ప్రవేశించాయి. బుధవారం సాయంత్రానికి పార్వతీపురం మండలం పెదమరికికి చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో సంచరిస్తూ పంటలకు నష్టం చేకూరుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గతంలో పెదమ రికి గ్రామంలోకి ఏనుగులు ప్రవేశించి బీభత్సం సృష్టిం చాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి ఏనుగులు వస్తే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 11:31 PM