Share News

ఆ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్

ABN , Publish Date - Sep 10 , 2026 | 07:53 AM

ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగించే అవకాశం ఉందని అన్నారు.

ఆ ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుంది: ట్రంప్
Donald Trump

ఇంటర్‌నెట్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగబోయే మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్ యుద్ధం ముగించే అవకాశం ఉందని అన్నారు. బుధవారం ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఎన్నికలు ముగిసిన వెంటనే యుద్ధం ఆగే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే.. ఇరాన్ ఎక్కువ రోజులు యుద్ధంలో కొనసాగే అవకాశం లేదు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి టెహ్రాన్ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది’ అని అన్నారు.


కాగా, ఇరాన్‌తో యుద్ధం దీర్ఘకాలికంగా కొనసాగితే రాజకీయంగా తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని ట్రంప్ టాప్ అడ్వైజర్లు అభిప్రాయపడుతున్నారు. అది అధ్యక్ష పదవీ కాలంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలుమార్లు ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ యుద్ధాన్ని ఎలాగైనా ముగించాలని భావిస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ నేతలు మాత్రం ఇందుకు సుముఖత వ్యక్తం చేయటం లేదు. హోర్ముజ్‌ను ఆధీనంలోకి తీసుకుని ఇరాన్‌‌పై పట్టుసాధించడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.


ఐదు ఇరాన్ నౌకలపై అమెరికా దాడులు

గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ప్రయాణిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌కు చెందిన నాలుగు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేసింది. ఖార్గ్ ఐలాండ్‌లో మరో ఆయిల్ ట్యాంక్‌పై అగ్రదేశం దాడి చేసింది. దీంతో జోర్డాన్‌లోని యూఎస్ బేస్‌పై ఇరాన్ మిసైల్ దాడులు చేసింది. దాదాపు 18 నుంచి 20 మిసైళ్లను వదిలింది. ఎయిర్ బేస్‌లోని డిఫెన్స్ సిస్టమ్స్ ఆ మిసైళ్లను గాల్లోనే పేల్చేశాయి.


ఇవి కూడా చదవండి

ఎకరం రూ.120 కోట్లు..

ఆయుధాల చోరీలో ముగ్గురు ఆర్మీ అధికారుల అరెస్ట్‌

Updated Date - Sep 10 , 2026 | 08:36 AM