Share News

డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:49 AM

ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌‌‌స్కీ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. విమానం మోల్దోవో నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ డ్రోన్ విమానాన్ని ఢీకొట్టబోయింది. విమానం వేగంగా ముందుకు కదలటంతో డ్రోన్ దాడి నుంచి తప్పించుకోగలిగింది.

డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
Zelensky plane drone

ఇంటర్‌నెట్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదమిర్ జెలెన్‌‌‌స్కీ డ్రోన్ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. నార్వే రాజు హెరాల్డ్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి జెలెస్కీ మంగళవారం విమానంలో మోల్దోవో నుంచి ఓస్లో బయలుదేరారు. విమానం మోల్దోవో నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ డ్రోన్ విమానాన్ని ఢీకొట్టబోయింది. విమానం వేగంగా ముందుకు కదలటంతో డ్రోన్ దాడి నుంచి తప్పించుకోగలిగింది. లేదంటే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఈ విషయాన్ని నార్వే ప్రధాన మంత్రి జోనాస్ గహర్ స్టోర్ బుధవారం మీడియాకు వెల్లడించారు.


‘మోల్దోవానుంచి టేకాఫ్ అవుతుండగా జెలన్‌స్కీ ప్రయాణిస్తున్న విమానాన్ని ఓ డ్రోన్ ఢీకొట్టబోయింది. తృటిలో ఆ ప్రమాదం తప్పింది. దీన్ని బట్టి ఆయన ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు’ అన్నారు. జెలెన్‌స్కీ మంగళవారం సాయంత్రానికి ఓస్లో చేరుకున్నారు. నార్వే ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టెన్‌బర్గ్, విదేశాంగ మంత్రి ఎస్పెన్ బార్త్ ఐడే‌లతో భేటీ అయ్యారు. ఎయిర్ డిఫెన్స్ సపోర్ట్‌తో కూడిన మిలటరీ సాయం, సివిల్ అసిస్టన్స్‌పై చర్చలు జరిపారు. బుధవారం నార్వే రాజు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల అనంతరం నార్వే నుంచి కెనడా వెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి

1100 ఎకరాల భూసేకరణ.. బుల్లెట్‌ రైల్‌ పనుల వేగవంతం

సింగపూర్‌ ప్రధాని వార్షిక వేతనం రూ.27కోట్లు

Updated Date - Sep 10 , 2026 | 07:35 AM