Share News

సింగపూర్‌ ప్రధాని వార్షిక వేతనం రూ.27కోట్లు

ABN , Publish Date - Sep 10 , 2026 | 06:40 AM

సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రధానిగా ఆయన గుర్తింపు పొందగా..

సింగపూర్‌ ప్రధాని వార్షిక వేతనం రూ.27కోట్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9: సింగపూర్‌ ప్రధాని లారెన్స్‌ వాంగ్‌ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రధానిగా ఆయన గుర్తింపు పొందగా.. అతి త్వరలో ఇది మరింత పెరగనుంది. 15ఏళ్ల తర్వాత సింగపూర్‌ ప్రఽధాని, మంత్రుల వేతనాల్లో మార్పులు చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం సింగపూర్‌ ప్రధాని వార్షిక వేతనం దాదాపు 36 లక్షల సింగపూర్‌ డాలర్లకు(రూ.27కోట్లు) చేరుకోనుంది. ప్రస్తుతం ఆయన వేతనం రూ.16.3 కోట్లు. తనకు పెరిగే అదనపు జీతం మొత్తాన్ని రాబోయే ఐదేళ్లపాటు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తానని లారెన్స్‌ వాంగ్‌ ప్రకటించారు. మంత్రుల వేతనాలు 18లక్షల సింగపూర్‌ డాలర్లకు పెరగనున్నాయి. వేతనాలను పెంచకపోతే గొప్ప ప్రతిభావంతులను రాజకీయాల్లోకి ఆకర్షించలేమని, అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు ఇది తప్పనిసరి అని వాంగ్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 10 , 2026 | 06:41 AM