వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Sep 10 , 2026 | 06:16 AM
‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండా’లంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైంది. కుప్పంలో మంగళవారం జరిగిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘చంపడానికైనా...’ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఫిర్యాదు
కుప్పం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండా’లంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదైంది. కుప్పంలో మంగళవారం జరిగిన వైసీపీ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంపడానికైనా, చావడానికైనా సిద్ధంగా ఉండాలంటూ పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టారని, రక్తాభిషేకం చేసైనా యుద్ధం గెలుస్తామని స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు కుప్పం ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కుప్పం అర్బన్ పోలీసులు ఎమ్మెల్సీ భరత్‌పై 206/2026 యూ/ఏఎస్ 192, 353/(1)(బీ), 351(2) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.