Share News

చంద్రబాబు అరెస్టే గొడ్డలి పార్టీ పతనానికి నాంది

ABN , Publish Date - Sep 09 , 2026 | 11:14 PM

: తెలుగుజాతి చరిత్రలో సెప్టెంబరు 9వ తేది చీకటిరోజని, ఆ రోజే గొడ్డలి పార్టీ పతనానికి నాందిపడిందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. సీఎం చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజు లు జైలులో నిర్బంధించిన సందర్భంగా బుధవారం రాత్రి స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద 53 కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.

చంద్రబాబు అరెస్టే గొడ్డలి పార్టీ పతనానికి నాంది
అద్దంకి టీడీపీ ఆఫీస్‌లో కొవ్వొత్తులతో టీడీపీ నేతలు

53 కొవ్వొత్తులతో టీడీపీ శ్రేణుల ప్రదర్శనలో ఇన్‌చార్జి డాక్టర్‌ లక్ష్మి

దర్శి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి) : తెలుగుజాతి చరిత్రలో సెప్టెంబరు 9వ తేది చీకటిరోజని, ఆ రోజే గొడ్డలి పార్టీ పతనానికి నాందిపడిందని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మీ చెప్పారు. సీఎం చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజు లు జైలులో నిర్బంధించిన సందర్భంగా బుధవారం రాత్రి స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద 53 కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొడ్డలి పార్టీ పతనానికి సెప్టెంబరు 9వ తేదీ పునాది పడిన రోజని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు ఏ తప్పు చేయకపోయినా అక్రమ కేసు బనాయించి 53 రోజులు జైలులో నిర్బధించటంతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎన్నో ఆందోళనలు చేశారన్నారు. టీడీపీ నేత డాక్టర్‌ కడియాల లలిత్‌సాగర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్‌ దారం నాగవేణిసుబ్బారావు, నేతలు చిన్నా, మారెళ్ల వెంకటేశ్వర్లు, మేడగం వెంకటేశ్వరరెడ్డి, మునగా శ్రీనివాసరావు, సందు వెంకటరావు, పూసల ఓబయ్య, శోభారాణి, నాగమణి పాల్గొన్నారు.

తాళ్లూరులో...

తాళ్లూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి) : తాళ్లూరులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర నాటక అకాడమి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బి.ఓబుల్‌రెడ్డి, డీసీబీ వైస్‌ చైర్మన్‌ శివనాగిరెడ్డి, నాయకులు మానం రమే్‌షబాబు, పిన్నిక రమేష్‌, వంగపల్లి నాగేశ్వరరావు, ఐ.సుబ్బారెడ్డి, కైపు రామకోటిరెడ్డి, మాగంటి శ్రీను, కాశీంసైదా, ఆగోలు సుబ్బారావు, లక్ష్మీనారాయణ, వడ్డెంపూడి సుధాకర్‌రావు పాల్గొన్నారు. తూర్పుగంగవరంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు జైలు ఘటనకు నిరసనగా కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షుడు వల్లపునేని సుబ్బయ్య, బద్దుల శ్రీను, సోమా ఆంజనేయులు, గిరిబాబు, యత్తపు అంజిరెడ్డి, గురుబ్రహ్మం, శ్రీనులు పాల్గొన్నారు.

పంగులూరులో...

పంగులూరు, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): పంగులూరు మండలం ముప్పవరం వద్ద హైవేపై జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన కార్యక్రమంలో టీడీపీ నేతలు క్టస్టర్‌ కోఆర్డినేటర్‌ ఏడుకొండలు, వరపర్ల సుబ్బారావు, గరిమిడి రాఘవ, యోహన్‌, తలపనేని రజినేష్‌, చింతల నాగేశ్వరరావు, మరియదాసు, శంకర్‌, వెంకటేశ్వర్లు, బసవయ్య, భాస్కరరావు పాల్గొన్నారు.


దొనకొండలో...

దొనకొండ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి) : దొనకొండలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మోడి ఆంజనేయులు, నేతలు నాగులపాటి శివకోటేశ్వరరావు, టీడీపీ ఖత్తర్‌ ఎన్‌ఆర్‌ఐ కోశాధికారి ఆంజనేయులు, దర్శి ఏఎంసీ డైరెక్టర్‌ నాగసుబ్బారెడ్డి, మండల టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పోతిపోగు చెన్నయ్య, పట్టణ అధ్యక్షుడు షేక్‌ తోహీద్‌, నాయకులు బండ్లా నారాయణ, విప్పర్ల లక్ష్మీరావు, కొమ్మతోటి సుబ్బారావు, యరగొర్ల బసవయ్య, అంకాల మల్లీ పాల్గొన్నారు.

అద్దంకిలో...

అద్దంకి,సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): అద్దంకి టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు నాగరాజు, యర్రాకులు రామాంజనేయులు, బచ్చల వాసు పాల్గొన్నారు.

ముండ్లమూరులో...

ముండ్లమూరు, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ముండ్లమూరు ఎన్టీఆర్‌ విగ్రహం, శంకరాపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, దర్శి మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ కోడిగ మస్తాన్‌ రావు, నాయకులు సుంకర రాఘవరెడ్డి, కూ రపాటి నారాయణ స్వామి, ఎంపీటీసీ సభ్యుడు సీహెచ్‌ వెంకటేశ్వరరావు, చాగంటి రాం బాబు, వీరనారాయణ, పిచ్చారావు,వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2026 | 11:14 PM