గుడివాడలో వైసీపీకి షాక్.. టీడీపీలోకి 250 మంది
ABN , Publish Date - Nov 15 , 2026 | 07:22 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ పార్టీకి గట్టి షాక్‌లు కొడుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో వైసీపీకి గట్టి షాక్ కొట్టంది.
మచిలీపట్నం, నవంబర్15: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ పార్టీకి గట్టి షాక్‌లు కొడుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా గుడివాడలో వైసీపీకి గట్టి షాక్ కొట్టంది. కృష్ణాజిల్లా వైసీపీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖాసిం అలియాస్ అబూ ఆదివారం టీడీపీలో చేరారు. ఆయనతోపాటు దాదాపు 250 మంది అనుచరులు వైసీపీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. కుండువా కప్పి వారందరిని పార్టీలోకి స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతోపాటు మాజీ మంత్రి పిన్నమనేని వేంకటేశ్వరరావు ఆహ్వానించారు.
గుడివాడ అభివృద్ధి చూసే తాము టీడీపీలోకి వచ్చామని ఈ సందర్భంగా అబూ ప్రకటించారు. మైనార్టీ షాదీఖానాకు రూ. 2 కోట్లు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే రాముకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలనుకునే వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామని ఎమ్మెల్యే రాము చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒకేసారి రెండు తుపాన్లతో ఏపీకి భారీ నష్టం: సీఎం చంద్రబాబు
ఏఈఐ ర్యాంకింగ్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం: పట్టాభిరామ్
For More AP News And Telugu News