Share News

ఏఈఐ ర్యాంకింగ్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం: పట్టాభిరామ్

ABN , Publish Date - Nov 15 , 2026 | 05:56 PM

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ (AEI) ర్యాంకింగ్-2026లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానాన్ని దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.

ఏఈఐ ర్యాంకింగ్‌లో ఏపీకి జాతీయ స్థాయిలో రెండో స్థానం: పట్టాభిరామ్
k pattabhiram

అమరావతి, నవంబర్15: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ (AEI) ర్యాంకింగ్-2026లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండో స్థానాన్ని దక్కించుకోవడం ఎంతో గర్వకారణమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానం.. ఓవరల్‌గా రెండో స్థానంలో మన రాష్ట్రం నిలవడానికి సీఎం చంద్రబాబు నాయుడి పనితీరే కారణమని చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వ పనితీరుకు ఈ ర్యాంక్ కొలమానంగా నిలుస్తోందని అభివర్ణించారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులుతోనే ఈ విజయం సాకారమైందని పేర్కొన్నారు. ప్రాథమిక సౌకర్యాలు, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సామాజిక భద్రత, సత్వర న్యాయం అనే ఐదు ప్రాధమిక అంశాలు ఆధారంగా ఓపీ జిందాల్‌కు చెందిన సెంటర్ ఫర్ న్యూ ఎకానామిక్ స్టడీస్ వారు ఈ ర్యాంకింగ్ ఇచ్చారని సోదాహరణంగా వివరించారు.


సామాజిక భద్రత పరంగా 0.69 పాయింట్లతో దేశంలోనే తొలి స్థానంలో మన రాష్ట్రం నిలిచిందని కె.పట్టాభిరామ్ తెలిపారు. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి సైతం సంక్షేమ ఫలాలు, న్యాయం అందినప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ హయంలో న్యాయం అనేది సామాన్యులకు అందనంత దూరంలో ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరికి న్యాయం, సామాజిక భద్రత దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నో అడ్మిషన్స్ బోర్డులు కనిపించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దామని గుర్తు చేశారు. సామాజిక భద్రత, సంక్షేమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సాధించిన ప్రగతి ఏంటో చెప్పాలి? అని ఆ పార్టీ నేతలను డిమాండ్ చేశారు.


అమ్మ ఒడి, పింఛన్లు, అన్న క్యాంటీన్లు ఇలా అనేక పథకాలకు కోత పెట్టి ప్రజలను మోసం చేశారంటూ వైఎస్ జగన్‌పై కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నిప్పులు చెరిగారు. వాక్ స్వాతంత్ర్యం లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన జగన్ ఇవాళ ఏఈఐ ర్యాంకింగ్స్‌పై మాట్లాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. సొంత చెల్లి, తల్లికి న్యాయం చేయని జగన్ ఇవాళ న్యాయం, సామాజిక భద్రత గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. స్పైడర్ మూవీలో విలన్ మాదిరి ప్రజలను ఏడిపించడమే వైఎస్ జగన్ పనిగా మారిందని వ్యంగ్యంగా అన్నారు. ప్రజల ముఖంలో చిరునవ్వు పెరిగే కొద్ది జగన్మోహన్ రెడ్డికి క్రెడిట్ చోరీ డిసీజ్ పెరిగిపోతుందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీకి ఓ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు కేటాయింపు

స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఏపీ బీజేపీ చీఫ్

For More AP News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 06:11 PM