ఏపీలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలు.. బీజేపీకి ఓ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు కేటాయింపు
ABN , Publish Date - Nov 15 , 2026 | 05:09 PM
రాష్ట్రంలో రెండో దశ పురపాలక సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆదివారం ఒక కొలిక్కి వచ్చింది.
అమరావతి, నవంబర్15: రాష్ట్రంలో రెండో దశ పురపాలక సంఘాల ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఆదివారం ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీకి ఓ కార్పొరేషన్‌తోపాటు రెండు మున్సిపాలిటీలు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. దీంతో రాజమండ్రి కార్పొరేషన్, కావలి, బాపట్ల మున్సిపాలిటీలను ఆ పార్టీకి కేటాయించింది. రాజమండ్రి మేయర్ అభ్యర్థిగా రేలంగి శ్రీదేవి, కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా గుండ్లపల్లి భరత్ కుమార్, బాపట్ల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇస్క సునీల్ కుమార్‌లను బీజేపీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ రెండో దశ పురపాలక సంఘాల ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికలతోపాటు నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పలు నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు ఘన విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో అనంతపురం నగర పాలక సంస్థను బీజేపీకి కేటాయించారు. ఇక్కడ వైసీపీ మేయర్ అభ్యర్థి రమేశ్ గౌడ్ ఘన విజయం సాధించారు. దీంతో అనంతపురం నగరపాలక సంస్థ వైసీపీ ఖాతాలో పడింది. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలలో కోర్టు కేసులు, వార్డుల పునర్విభజన, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల నిర్వహణ ఆగిపోయింది. అందుకు సంబంధించిన కేసులు కోర్టులో ఇటీవల క్లియర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీటికి ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 123 పట్టన స్థానిక సంస్థలు ఉన్నాయి. వాటిలో 100 సంస్థలకు తొలి దశలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఏపీ బీజేపీ చీఫ్
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. టిప్పర్ ఢీకొని మహిళ మృతి, భర్తకు తీవ్ర గాయాలు
For More AP News And Telugu News