Share News

స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఏపీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Nov 15 , 2026 | 02:50 PM

స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గతంలో సాధించిన విజయాలను పునరావృతం చేసేలా ఈ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని చెప్పారు.

స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యం: ఏపీ బీజేపీ చీఫ్
AP BJP Chief PVN Madhav

అమరావతి, నవంబర్15: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యమని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. గతంలో సాధించిన విజయాలను పునరావృతం చేసేలా ఈ ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని తెలిపారు. ఆదివారం రాజధాని అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. 2024 అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు ఇచ్చారని అన్నారు. ఈ మద్దతు ఈసారి కూడా కొనసాగుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల స్పందనతోపాటు విశ్వాసం కూడా పెరుగుతోందని పేర్కొన్నారు.


రాష్ట్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పీవీఎన్ మాధవ్ చెప్పారు. అన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమన్వయంతో అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలపై చర్చలు జరిపామని వివరించారు. పంచాయతీ ఎన్నికల మొదటి విడతకు కూడా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించామని తెలిాపరు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు అంశాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పుణే విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం

For More AP News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 03:04 PM