ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పుణే విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:56 PM
పుణే విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. పుణే నుంచి గౌహతి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా.. పుణే విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పుణే విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. పుణే నుంచి గౌహతి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్‌లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా.. పుణే విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. కాగా.. విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఫుణే నుంచి గౌహతి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ (6E 0623) లో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన వెంటనే.. విమానం ల్యాండింగ్ చక్రాలు లోపలికి వెళ్లలేదు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. పుణే విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఏటీసీ అధికారులు రన్‌వేపై ‘లో పాస్’ నిర్వహించి చక్రాల పరిస్థితిని పరిశీలించారు. ఈ సమయంలో విమానంలో 192 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారని.. వారంతా క్షేమంగా ఉన్నారని సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రయాణికులను గౌహతి పంపేందుకు ప్రత్యామ్నాయంగా.. బెంగుళురు నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల భయం.. పాకిస్థాన్‌లోని రహస్య స్థావరాలకు హఫీజ్ సయీద్, మసూద్ అజర్..
ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..