ప్రతి ఇంటా పారిశ్రామికవేత్త ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచన: గళ్లా మాధవి
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:34 PM
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ, సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు.
అమరావతి, నవంబర్ 24: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ, సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తోందని టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఏడాదికి రూ.250 చొప్పున పెంచితే, కూటమి ప్రభుత్వం రాగానే వృద్ధుల పెన్షన్ను ఏకంగా రూ.4,000కు పెంచి పేదలకు అండగా నిలిచిందన్నారు. దివ్యాంగులకు రూ.6,000, మంచానికే పరిమితమైన వారికి, కిడ్నీ తలసేమియా బాధితులకు రూ.15,000 చొప్పున పెన్షన్ అందిస్తూ ఆ కుటుంబాలను ఆదుకుంటోందని వివరించారు.
పెన్షన్ను ఓట్ల కోసం ఇచ్చే తాయిలంగా కాకుండా పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా మార్చిన ఘనత చంద్రబాబుదే అని ఎమ్మెల్యే అన్నారు. పెన్షన్ల కోసం రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.1.70 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుందని తెలిపారు. గత పాలకులు పెన్షన్లను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటే.. కూటమి ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా అందిస్తోందన్నారు. ఓట్లు వేయలేదనే కారణంతో గతంలో అర్హుల పెన్షన్లు తొలగించిన పరిస్థితులను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. సంజీవని పథకంతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడమే చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్నదే చంద్రబాబు ఆలోచన అని ఎమ్మెల్యే తెలిపారు. పీ4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 2029లో అధికారంలోకి వస్తామని చెబుతున్న వైసీపీ.. ప్రస్తుతం అమలవుతున్న పెన్షన్లను యథాతథంగా కొనసాగించగలదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనుకుంటే.. జగన్ ప్రతి గల్లీలో ఒక గూండాను తయారు చేయాలనుకుంటున్నారు అంటూ గళ్లా మాధవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి...
ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ.. 15 నిమిషాల్లోనే ఛేదించిన విజయవాడ పోలీసులు
గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. రోడ్ షో మధ్యలోకి దూసుకొచ్చిన వైసీపీ బృందం
Read Latest AP News And Telugu News