ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ.. 15 నిమిషాల్లోనే ఛేదించిన విజయవాడ పోలీసులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:50 PM
కనకదుర్గమ్మ దర్శనం అనంతరం ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన హైదరాబాద్ మహిళకు విజయవాడ పోలీసులు తక్షణమే సాయం చేశారు.
విజయవాడ, నవంబర్ 24: ఆటోలో మర్చిపోయిన మహిళ బ్యాగ్‌ను 15 నిమిషాల్లోనే పోలీసులు గుర్తించిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఓ మహిళ విజయవాడకు వచ్చారు. దుర్గమ్మ దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో భాగంగా ఆటో ఎక్కారు. అయితే బస్టాండ్‌కు చేరుకున్న సదరు మహిళ.. ఆటోలో బ్యాగ్ మర్చిపోయారు. అయితే కాసేపటికే బ్యాగ్ లేకపోవటాన్ని గుర్తించిన ప్రయాణికురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు.
మహిళ ఫిర్యాదుతో కృష్ణలంక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ద్వారా ఆటో నంబర్‌ను కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది గుర్తించింది. ఆటో డ్రైవర్‌తో మాట్లాడిన పోలీసులు.. బ్యాగ్‌ను తిరిగి తెప్పించారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించారు. కృష్ణలంక ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఇన్‌స్పెక్టర్ దుర్గారావు పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. పోలీసుల వేగవంతమైన స్పందనపై బాధితురాలు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల పనితీరును నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ పంచాయతీ ఫేజ్-3 ఎన్నికలు.. వార్డులకు 1.03 లక్షల నామినేషన్లు
అన్నవరంలో గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. 1.50 లక్షల మందితో వైభవంగా ఉత్సవం
Read Latest AP News And Telugu News