Share News

కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఏపీలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

ABN , Publish Date - Nov 24 , 2026 | 10:10 AM

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏపీలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాదేవుడిని దర్శించుకుంటున్నారు.

కార్తీక పౌర్ణమి వేడుకలు.. ఏపీలో శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
Karthika Pournami

అమరావతి, నవంబర్ 24: కార్తీక పౌర్ణమి సందర్భంగా ఏపీలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి మహాదేవుడిని దర్శించుకుంటున్నారు. నదుల్లో, దేవాలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రముఖ శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. శివనామస్మరణతో మహాదేవుని దేవాలయాలు మార్మోగుతున్నాయి.


పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురం వశిష్ట గోదావరిలో కార్తీక పౌర్ణమి స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి వలందర్ స్నానాల ఘాట్ భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు నదీ స్నానాలు చేసి గోదావరిలో కార్తీకదీపాలు విడిచిపెట్టారు.

తూర్పుగోదావరి జిల్లా: కార్తీక పౌర్ణమి సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు గోదావరి నదిలో స్నానాలు చేసి కార్తిక దీపాలు విడిచిపెడుతున్నారు. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతున్నాయి.


విజయవాడ: కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. కృష్ణా నదిలో స్నానం ఆచరించిన భక్తులు.. మహాదేవుని దర్శనం కోసం ఉదయం మూడు గంటల నుంచి క్యూ లైన్‌లలో బారులు తీరారు. హర హర మహాదేవ, ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రంతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. కార్తీక దామోదరుడికి పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, మహా రుద్రాభిషేకాలు చేస్తున్నారు. పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు.

నంద్యాల: శ్రీశైలం ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ముందు భాగంలో గంగాధర మండపం వద్ద సాయంత్రం జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించనున్నారు. పౌర్ణమి సందర్భంగా పుష్కరిణిలో లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి ఇవ్వనున్నారు. మహానంది క్షేత్రంలో నేడు కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు రాజగోపురం ఎదుట జ్వాలా తోరణం వేడుకను నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోటి దీపాల వెలుగులతో మహానంది విరాజిల్లనుంది. జ్వాలా తోరణం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.


ఇవి కూడా చదవండి...

కార్తీక పౌర్ణమి శోభ.. దేశవ్యాప్తంగా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు..

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 10:48 AM