హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కేసు.. డిస్పోజబుల్ మెయిల్ ఐడీతో మెసేజ్
ABN , Publish Date - Nov 24 , 2026 | 12:30 PM
హైదరాబాద్‌లో బాంబ్ బెదిరింపు కలకలం కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, ఒక ప్రముఖ హోటల్‌ను పేల్చివేస్తామంటూ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈమెయిల్‌పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
హైదరాబాద్, నవంబర్ 24: భాగ్యనగరంలో బాంబ్ బెదిరింపు కలకలం కేసు విచారణలో పోలీసులు పురోగతి సాధించారు. కాచిగూడ రైల్వే స్టేషన్, ఒక ప్రముఖ హోటల్‌ను పేల్చివేస్తామంటూ లష్కరే తోయిబా పేరుతో వచ్చిన ఈమెయిల్‌పై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. డిస్పోజబుల్ మెయిల్ ఐడీ వాడి ఈ మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ ఆచూకీ బయటపడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ అవసరం లేని తాత్కాలిక మెయిల్ ఐడీతో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా పేరుతో వచ్చిన హెచ్చరికలపై సీపీ విచారణ చేపట్టారు.
పోలీస్ కమిషనర్ అధికారిక మెయిల్‌కు నవంబర్ 21న సాయంత్రం 7:13 గంటలకు బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. భారత సైన్యం చేతిలో తమ కమాండర్లు హతమైనందుకు ప్రతీకారంగా దాడులు చేస్తామని.. ముంబై తరహాలు దారులకు పాల్పడతామంటూ మెయిల్‌లో హెచ్చరించారు. ఈ క్రమంలో బెదిరింపు మెయిల్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. వీపీఎన్ (VPN), ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది.
ఇవి కూడా చదవండి...
కార్తీక పౌర్ణమి శోభ.. దేశవ్యాప్తంగా పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్
Read Latest Telangana News And Telugu News