గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. రోడ్ షో మధ్యలోకి దూసుకొచ్చిన వైసీపీ బృందం
ABN , Publish Date - Nov 24 , 2026 | 01:17 PM
మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుడివాడలోని 28వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విలీన గ్రామం బొమ్ములూరులో ఎమ్మెల్యే రాము, కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కృష్ణాజిల్లా, నవంబర్ 24: మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గుడివాడలోని 28వ వార్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విలీన గ్రామం బొమ్ములూరులో ఎమ్మెల్యే రాము, కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలాగే వైసీపీ తరఫున పోటీగా మాజీ మంత్రి కొడాలి నాని సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్ ప్రచారం చేపట్టారు. షెడ్యూల్ ప్రకారం కూటమి శ్రేణులు మెయిన్ రోడ్డులో భారీ ర్యాలీగా రోడ్ షో నిర్వహించారు. అయితే శశిభూషణ్ నేతృత్వంలో వైసీపీ బృందం హఠాత్తుగా రోడ్ షో మధ్యలోకి దూసుకొచ్చింది.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రాము.. ‘గొడవలు వద్దు.. సహకరించండి’ అంటూ వైసీపీ నేతలకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఎమ్మెల్యే విజ్ఞప్తిని వినకుండా రెచ్చగొట్టేలా రోడ్ షో మధ్యలోకి వైసీపీ బృందం దూసుకొచ్చింది. శశిభూషణ్ సూచనలతో వైసీపీ మహిళా నేతలు... టీడీపీ కార్యకర్తల వద్ద జెండాలు లాక్కొని కాలితో తొక్కుతూ రెచ్చిపోయారు. ఫ్యాన్ సింబల్స్ చూపుతూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వైసీపీ శ్రేణులు వ్యవహరించారు. అయితే కూటమి శ్రేణులకు ఎమ్మెల్యే రాము సర్దిచెప్పారు. ఎన్నికల వార్ వన్ సైడ్ అయిందని.. ఈ టైంలో గొడవలు వద్దంటూ కూటమి శ్రేణులను సమన్వయం చేశారు. అక్కడి పరిస్థితిని గమినించిన వెంటనే పోలీసులు బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి.
ఇవి కూడా చదవండి...
అన్నవరంలో గిరిప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు.. 1.50 లక్షల మందితో వైభవంగా ఉత్సవం
ఆటోలో బ్యాగ్ మర్చిపోయిన మహిళ.. 15 నిమిషాల్లోనే ఛేదించిన విజయవాడ పోలీసులు
Read Latest AP News And Telugu News