‘ఎలాంటి సాయానికైనా సిద్ధం’.. ఏపీ మంత్రికి తెలంగాణ డిప్యూటీ సీఎం ఫోన్
ABN , Publish Date - Oct 31 , 2026 | 03:13 PM
ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అమరావతి, అక్టోబర్ 31: మంత్రి గొట్టిపాటి రవి కుమార్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. ఆర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఉపముఖ్యమంత్రికి మంత్రి గొట్టిపాటి రవి వివరించారు. సిబ్బంది, సామాగ్రిని కొరత ఉంటే తెలియజేయాలని భట్టి కోరారు. తెలంగాణ నుంచి ఎలాంటి సాయమైనా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో 1,100 మందికి పైగా తెలంగాణ విద్యుత్ సిబ్బంది పని చేస్తున్నారని ఏపీ మంత్రి తెలిపారు. ఏపీ డిస్కంలకు చెందిన 4,400 మంది సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో ఉన్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
విద్యుత్ లైన్ల పునరుద్ధరణ:
నరసాపురం డివిజన్ పాలకొల్లు సెక్షన్ పరిధిలోని అదర్త్యపాలెంలో 11 కేవీ విద్యుత్ లైన్లను విద్యుత్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. వరి పొలాలు, లోతైన చేపల చెరువుల్లోకి దిగి ప్రతికూల పరిస్థితులను కూడా లెక్కచేయకుండా శ్రమిస్తున్నారు. పునరుద్ధరణ పనుల్లో శ్రీ సత్యసాయి పుట్టపర్తి సర్కిల్, హిందూపురం డివిజన్ లైన్మెన్లు సేవలందిస్తున్నారు. మడకశిర సబ్ డివిజన్ పరిధిలోని అగళి సెక్షన్ అధికారుల బృందం ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన విద్యుత్ పనులు సాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి...
ఓటు వేసి నేరుగా ఇంటికి వెళ్లాలి’.. జగన్కు డీఐజీ సూచన
రాప్తాడు ఘటన.. విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News