Share News

రాప్తాడు ఘటన.. విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 31 , 2026 | 02:13 PM

అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో అమానుష దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

రాప్తాడు ఘటన.. విద్యార్థిని తల్లికి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 31: అనంతపురం జిల్లా రాప్తాడు జెడ్పీ స్కూల్‌లో అమానుష దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని తల్లితో సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని తల్లితో సీఎం ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండాలని, నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యార్థినిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేద్దామని.. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.


విద్యార్థినికి అందుతున్న వైద్య సాయంపై స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. ఉన్మాది దాడిలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. ఇరువురు విద్యార్థినిలకూ మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


ఇవి కూడా చదవండి...

అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ ఛాలెంజ్

‘ఓటు వేసి నేరుగా ఇంటికి వెళ్లాలి’.. జగన్‌కు డీఐజీ సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 02:56 PM