Share News

రాప్తాడులో విద్యార్థినిపై దాడి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Oct 31 , 2026 | 12:51 PM

అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూలులో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటన పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

రాప్తాడులో విద్యార్థినిపై దాడి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
AP CM Chandrababu

అమరావతి, అక్టోబర్ 31: అనంతపురం జిల్లా రాప్తాడులోని జిల్లా పరిషత్ హైస్కూలులో పదో తరగతి విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటన పట్ల సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల తరగతి గదిలో విద్యార్థినిపై రంపంతో అత్యంత అనుమానుషంగా దాడి చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


తీవ్ర గాయాలపాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ బాలికకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని జిల్లా పోలీసు అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.


నిందితుడిని కఠినంగా శిక్షించాలి: హోం మంత్రి

రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది అమానుష దాడి పట్ల హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై అనంతపురం జిల్లా ఎస్పీతో మాట్లాడి, ఈ దాడి వివరాల గురించి మంత్రి ఆరా తీశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి అనిత ఆదేశించారు.


ఉన్మాదులను ఉక్కు పాదంతో అణిచేస్తాం: మంత్రి లోకేశ్

ఉక్కు పాదంతో అణిచేస్తామని ఉన్మాదులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. రాప్తాడు హైస్కూలులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఆయన స్పందించారు. చిన్నారి చెల్లిని క్లాస్ రూమ్‌లో నెత్తుటి మడుగులో చూశాక కన్నీళ్లు ఆగడం లేదని అన్నారు. గుండె బరువెక్కిందని తెలిపారు.

రాప్తాడులో ఉన్మాది ఘాతుకం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ఆడపిల్లలు, మహిళల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా చేస్తామని హెచ్చరించారు. పిల్లల భద్రత పట్ల నిర్లక్ష్యం వహించే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎల్‌ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ తాగు నీటి ఏర్పాట్లకు ప్రత్యేక నిధులు: మంత్రి సీతక్క

వెండి ధరలో భారీ పతనం.. ఒక్కరోజే రూ.10 వేల తగ్గుదల

For More AP News and Telugu News

Updated Date - Oct 31 , 2026 | 01:19 PM