సాయికృష్ణ కేసు.. జులై 6కు విచారణను వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ABN , Publish Date - Jun 24 , 2026 | 11:57 AM
విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది.
అమరావతి, జూన్, 24 (ఆంధ్రజ్యోతి): విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ కేసు (Gade Sai Krishna Case) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పోలీస్ వర్గాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థకి(CBI) అప్పగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై(PIL) ఈరోజు (బుధవారం) న్యాయస్థానంలో విచారణ జరిగింది.
కేసు దర్యాప్తు పురోగతిని వివరించిన ఏజీ..
ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కోర్టుకు దర్యాప్తు పురోగతిని వివరించారు. ఈ కేసు సమగ్ర దర్యాప్తు కోసం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ఏజీ ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా, సక్రమంగా సాగేందుకు ప్రభుత్వం అన్నిరకాల కఠిన చర్యలు తీసుకుందని ఏజీ వెల్లడించారు.
జులై 6కు విచారణ వాయిదా..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని, ఈ రోజే (బుధవారం) ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తామని ఏజీ హైకోర్టుకు స్పష్టం చేశారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు విన్న న్యాయస్థానం.. సిట్ దర్యాప్తు ఎలా సాగుతుందో, నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఏం చేస్తారో వేచి చూద్దామని వ్యాఖ్యానించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణలో సీఐ నాగరాజు నోరు విప్పని నేపథ్యంలో, ఆయన అరెస్ట్ కావడం, కోర్టు ముందు హాజరుపరుస్తుండటంతో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం
కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News