తిరువూరులో రూ.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:38 PM
ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఈరోజు తిరువూరులో మధిర రహదారి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
ఎన్టీఆర్ జిల్లా, సెప్టెంబర్ 22: జిల్లాలోని తిరువూరు పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఈరోజు(మంగళవారం) తిరువూరులో మధిర రహదారి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం ద్వారా రూ.14 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి వర్చువల్‌గా కార్యక్రమాన్ని ప్రారంభించగా, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధిర రోడ్డులో భూమిపూజ నిర్వహించి పనులను మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ రోడ్ల తరహాలో, అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్ల మాదిరిగా తిరువూరులో మధిర రోడ్డును అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు పట్టణ మౌలిక వసతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు చెప్పారు. రూ.14 కోట్లతో చేపట్టనున్న పనులు పూర్తయితే మధిర రోడ్డు రూపురేఖలు మారనున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డప్పు కొట్టి, డ్యాన్స్ వేసి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఏ.కుమార్, మున్సిపల్ కమిషనర్ కె.మనోజ్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
ఏపీ పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు..
Read Latest AP News And Telugu News