కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు.. దసరాకు ముందే పంపిణీ!
ABN , Publish Date - Sep 22 , 2026 | 03:20 PM
తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లో కొత్త పెన్షన్ల ప్రారంభానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దసరా పండుగకు ముందే అర్హులైన లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అందేలా చూడాలని సూచించారు. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఒంటరి మహిళలు, వితంతువులకు పూర్తి స్థాయిలో పెన్షన్లు అందజేయాలని మంత్రి సూచించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ పెన్షన్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దసరా నాటికి కొత్త పెన్షన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
వాయుగుండంతో సర్కార్ అప్రమత్తం.. హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో డ్యాన్స్.. విశాఖ టీమ్‌పై చర్యలు
Read Latest Telangana News And Telugu News