Share News

టీచర్లపై గంజాయి, బ్లేడ్ బ్యా‌చ్‌లతో దాడులు దారుణం: మంత్రి నిమ్మల

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:20 PM

విజయవాడలో టీచర్లపై గొడ్డలి పార్టీ రౌడీమూక దాడిని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. గొడ్డలి పార్టీ రప్పా రప్పా సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని మండిపడ్డారు.

టీచర్లపై గంజాయి, బ్లేడ్ బ్యా‌చ్‌లతో దాడులు దారుణం: మంత్రి నిమ్మల
Nimmala Ramanaidu

పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 22: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ వర్చువల్ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విజయవాడలో టీచర్లపై గొడ్డలి పార్టీ రౌడీమూక దాడిని తీవ్రంగా ఖండించారు. గొడ్డలి పార్టీ రప్పా రప్పా సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని మండిపడ్డారు. గౌరవించాల్సిన టీచర్లపై గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యా‌చ్‌లతో దాడులు చేయించడం దారుణమన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను గొడ్డలి పార్టీ నాయకులు అవమానిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా గొడ్డలి పార్టీ పనిచేస్తోందని విమర్శించారు. రేపు అధికారంలోకి వస్తే నరకడం, చంపడం, దాడులు చేయడమే తమ సంస్కృతి అని మరోసారి ప్రజలకు గొడ్డలి పార్టీ వార్నింగ్ ఇస్తోందన్నారు.


ప్రకాశం జిల్లా, గుంటూరు, విజయవాడ పలు నగరాల నుంచి రౌడీ మూకలను తీసుకొచ్చి విజయవాడలో టీచర్లపై గొడ్డలి పార్టీ దాడులు చేయించిందని మంత్రి ఆరోపించారు. సైనికుడిగా దేశానికి సేవ చేసి అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యక్తి కూడా వైసీపీ దుర్మార్గపు వైఖరి వల్ల ఇబ్బందిపడటం ఆవేదన కలిగిస్తోందన్నారు. క్రీడల్లో ప్రతిభ చాటి నిబంధనల ప్రకారం డీఎస్సీలో ఉపాధ్యాయునిగా పొందిన వారిని ఫేక్ అంటూ అవమానించడం సరికాదన్నారు. గ్రూప్-1 అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే, మెగా డీఎస్సీపై మాజీ సీఎం జగన్ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 02:46 PM