Share News

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:19 PM

ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల నిర్వహణకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతోపాటు, 2025 అవార్డులను ఒకేసారి నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
AP Nandi Awards

అమరావతి, సెప్టెంబర్ 22: ఏపీలో నంది అవార్డుల సందడి మొదలుకానుంది. సినీ, టీవీ రంగాలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల నిర్వహణకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(G.O.Rt.No. 1843) జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో ఉన్న నంది అవార్డులతోపాటు, 2025 అవార్డులను ఒకేసారి నిర్వహించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2012-2016 కాలానికి చెందిన నంది, జాతీయ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నవంబర్ 2026లో విజయవాడలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. 2017-2024, 2025 సంవత్సరాల నంది అవార్డులకు సంబంధించి జ్యూరీ కమిటీల ఏర్పాటును సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని ఆదేశించింది. 2017-2024, 2025 అవార్డుల విజేతల జాబితాను నవంబర్ 2026లో అధికారికంగా ప్రకటించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది.


2017 నుంచి 2024 సంవత్సరాలకు సంబంధించి ప్రతి ఏడాదికి గాను 1వ, 2వ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌లు, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను మాత్రమే అందజేయనున్నట్టు ఉత్వర్వుల్లో పేర్కొంది. టీవీ విభాగంలో 2017-2024 కాలానికి ప్రతి ఏటా 1వ, 2వ ఉత్తమ మెగా సీరియళ్లు, రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. నంది ఫిల్మ్ అవార్డుల (2017-2024 & 2025) వేడుకను డిసెంబర్ 2026లో అమరావతి/విజయవాడలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. అలాగే, నంది టీవీ అవార్డుల (2017-2024 & 2025) ప్రదానోత్సవాన్ని డిసెంబర్ 2026లో తిరుపతిలో నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది.


ఇవి కూడా చదవండి...

విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది.. అంతరాయాలు లేకుండా చేస్తున్నాం: గొట్టిపాటి రవికుమార్

‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 01:26 PM