ఏపీ పంచాయతీరాజ్ శాఖలో బదిలీలు..
ABN , Publish Date - Sep 22 , 2026 | 02:40 PM
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు గ్రామీణ పంచాయతీ అధికారులు, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు, జిల్లా ప్రజాపరిషిత్ డిప్యూటీ సీఈవోలుగా బాధ్యతలు అప్పగించింది.
అమరావతి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖలో పలువురు అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ జిల్లాలకు గ్రామీణ పంచాయతీ అధికారులు, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులు, జిల్లా ప్రజాపరిషిత్ డిప్యూటీ సీఈవోలుగా బాధ్యతలు అప్పగించింది. పశ్చిమ గోదావరి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా పి.విజయభాస్కర్ నియమితులయ్యారు. అమలాపురం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా పి.వసంత మాధవి బాధ్యతలు చేపట్టనున్నారు. అనకాపల్లి జిల్లా పంచాయతీ అధికారిగా ఎస్.మంజుల వాణి, అనకాపల్లి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా కె.రమామణి నియమితులయ్యారు.
అలాగే, సత్యసాయి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా ఎం.వెంకటరత్నం బాధ్యతలు చేపట్టనున్నారు. కదిరి డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారిగా వి.రామాంజనేయులు నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా కె. అనురాధ, అనకాపల్లి జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా ఇ.సందీప్ నియమితులయ్యారు. సత్యసాయి జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా వై.సమంత నియమితులవగా, మార్కాపురం జిల్లా ప్రజాపరిషత్ డిప్యూటీ సీఈవోగా సీహెచ్ దుర్గా ప్రసాద్ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఇవి కూడా చదవండి...
‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
Read Latest AP News And Telugu News