Home » Tiruvuru
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక రసవత్తరంగా సాగింది. చివరికి టిడిపి పీఠం కైవసం చేసుకుంది. టిడిపి అభ్యర్థి కోలికపోగు నిర్మల విజయ దుందుభి మ్రోగించారు.
Krishna Dist: తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ సోమవారం ఆర్డీవో మాధురి నిర్వహించారు. ఈ ఎన్నికలో తెలుగుదేశం బలపరిచిన తిరువూరు 1వ వార్డు కౌన్సిలర్ నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 20 మంది సభ్యుల్లో 10 మంది టీడీపీకి మద్దతు తెలపగా.. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్యే కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు. దీంతో నిర్మల ఎన్నిక అయ్యారు.
Tiruvuru Political Clash: తిరువూరుకు దేవినేని అవినాష్ రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
TDP Vs YSRCP Tiruvuru: తిరువూరు నగర పంచాయతీ ఉపఎన్నిక కోరం లేక వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు తదుపరి ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆర్డీవో మాధురి వెల్లడించారు.
Tiruvuru Panchayat Election: తిరువూరు పంచయతీ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
TDP Vs YSRCP: తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు.
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకపోవడం వివాదం రేపింది. ఆయన ఎన్నోసారి ప్రయత్నించినప్పటికీ, చంద్రబాబు అతన్ని విస్మరించి ముందుకు సాగారు. కొలికపూడి రోడ్డుపై ఇబ్బందులు ఎదుర్కొన్నారు
Tiruvuru Politics: తిరువూరులో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను పోటాపోటీగా నిర్వహించేందుకు పూనుకున్నారు కూటమి శ్రేణులు. ఎమ్మెల్యే, ఆర్గానిక్ ప్రొడక్షన్ చైర్మన్ ఇరువురి ఆధ్వర్యంలో జయంతి వేడుకలకు పిలుపునిచ్చారు.
తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో పోలీసుల భారీగా మోహరించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఎపిసోడ్ టీడీపీలో హిట్ పుట్టిస్తోంది. మాజీ ఏఎంసీ చైర్మన్ రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల క్రితం కొలికపూడి అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 11 గంటలకు కొలికపూడి డెడ్ లైన్ పూర్తి అయింది. దీంతో ఎమ్మెల్యే ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది.