Share News

రేపు ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:23 PM

ఏపీ కేబినెట్ రేపు ప్రత్యేకంగా సమావేశంకానుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగనుంది. బీసీ రిజర్వేషన్లపై జీవోలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌పై చర్చించేందుకు కేబినెట్ సమావేశమవనుంది.

రేపు ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ
AP Cabinet Meeting

అమరావతి, అక్టోబర్ 9: ఏపీ కేబినెట్ రేపు(శనివారం) ప్రత్యేకంగా సమావేశంకానుంది. రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ భేటీ జరుగనుంది. బీసీ రిజర్వేషన్లపై జీవోలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌పై చర్చించేందుకు కేబినెట్ సమావేశమవనుంది. కమిషన్ నివేదికను మంత్రివర్గం పరిగణలోకి తీసుకోనుంది. బీసీలకు రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్స్ చేసిన రిజర్వేషన్లు, జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించనున్నట్లు సమాచారం.


మంత్రివర్గం నిర్ణయానికి అనుగుణంగా వెంటనే జీవోలను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో బీసీ రిజర్వేషన్లపై విడుదల చేసిన జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ రావాలని సచివాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.


ఇవి కూడా చదవండి..

బీసీలకు 34 శాతం టికెట్లు ఇచ్చి తీరుతాం: గల్లా మాధవి

మీ భూమి-మీ హక్కును కాపాడే బాధ్యత మాది: చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 04:51 PM