జగన్ అడ్డా కడపలో టీడీపీ హవా.. నాలుగు మున్సిపాలిటీలు కైవసం
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:21 PM
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది.
కడప, నవంబర్ 3: ఏపీలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకుంది. బద్వేల్ మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. రాజంపేట మున్సిపాలిటీలోనూ టీడీపీ విజయం సాధించి మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది. రాయచోటిలో మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. మైదుకూరు మున్సిపాలిటీలోనూ టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఇక ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నాలుగు చోట్ల టీడీపీ, ఒక చోట బీజేపీ గెలుపొందినట్లైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయా ప్రాంతాల్లో విజయం సాధించిన అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.. వర్షపాతం లోటు తగ్గిందన్న అధికారులు
ఆత్మకూరు మున్సిపాలిటీలో టీడీపీ ఘన విజయం.. ఆ పార్టీ అభ్యర్థికి 2,206 ఓట్ల మెజారిటీ
Read Latest AP News And Telugu News