వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
ABN , Publish Date - Sep 18 , 2026 | 02:41 PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో A2 నిందితుడి సునీల్ యాదవ్‌కు ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
కడప, సెప్టెంబర్ 18: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో A2 నిందితుడి సునీల్ యాదవ్‌కు ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 24వ తేదీన ఈ కేసు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఈడీ స్పష్టం చేసింది. అలాగే కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలతోపాటు వారి ఆస్తుల వివరాలతో ఈ విచారణకు రావాలని సునీల్ యాదవ్‌కు ఈడీ సూచించింది.
వైఎస్ వివేకా హత్యకు ముందు.. ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలపై సునీల్ యాదవ్‌ను ఈ సందర్భంగా ఈడీ ప్రశ్నించనుంది. ఇక ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
2019 మార్చి15వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. సీబీఐ దర్యాప్తు ఆధారంగా పీఎంఎల్ఏ (PMLA) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. వైఎస్ వివేకా హత్య కోసం రూ. 40 కోట్ల సుపారీ కుదిరిందనే ఆరోపణలపై ఈడీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. ఈ కేసులో ఇప్పటికే అప్రూవర్‌గా మారిన దస్తరిగిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ విచారించింది.
అతడి నుంచి ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. అనంతరం కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ తదితరుల నివాసాలు, కార్యాలయంలో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో భారీగా నగదుతోపాటు కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొదట ఓట్ చోరీ.. ఇప్పుడు పార్టీ చోరీ: రాహుల్ గాంధీ
దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్ ఎంవోయూ
For More AP News And Telugu News