పంచాయతీ ఎన్నికల్లో పంపకాల్లేవు .. జనసేన కీలక ఆదేశాలు
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:16 PM
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ జనసేన పార్టీ ఎక్స్ వేదికగా కీలకమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది.
అమరావతి, నవంబరు 22: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను.. జనసేన నాయకులు అడ్డుకోకూడదని ఆ పార్టీ ఎక్స్ వేదికగా కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
‘గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి రాజకీయ పార్టీలకు అతీతంగా, స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో జరిగే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ప్రతీ ఒక్కరికి ఎలాంటి రాజకీయపరమైన అడ్డంకులు లేకుండా నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసి పోటీ చేయవచ్చు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే జనసేన శ్రేణులను.. నాయకులు అడ్డుకోకూడదు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి స్థానాల పంపకాలు ఉండవు. జనసేన పార్టీ తరఫున స్వేచ్ఛాపూరిత వాతావరణంలో ఎన్నికలు జరగాలని స్పష్టం చేస్తున్నాము’ అని పేర్కొంటూ జనసేన పార్టీ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి