అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన
ABN , Publish Date - May 12 , 2026 | 09:43 PM
అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది. రాజధాని అభివృద్ధి పురోగతిపై ఏపీసీఆర్డీఏ అధికారులతో వరల్డ్ బ్యాంకు బృందం సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది.
అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం రెండు రోజుల పాటు పర్యటించనుంది. రాజధాని అభివృద్ధి పురోగతిపై ఏపీసీఆర్డీఏ అధికారులతో వరల్డ్ బ్యాంకు బృందం సమీక్షా సమావేశాలు నిర్వహించనుంది. మే 11వ తేదీ నుంచి 12వ తేదీ వరకు అమరావతిలో వరల్డ్ బ్యాంక్ బృందం పర్యటించనుంది. రాయపూడి సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశాలు నిర్వహించనుంది.
పీపీపీ భాగస్వామ్యాలు, రెండో విడత ఆర్థిక సహకారంపై చర్చించనుంది. ఈ సమావేశానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్ వి. విజయరామరాజు హాజరయ్యారు. AGICL ఎండీ SVR శ్రీనివాస్‌తో పీపీపీ అంశాలపై మాట్లాడనుంది. ప్రపంచ స్థాయి ప్రజారాజధానిగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఏపీసీఆర్డీఏ అధికారులు చెప్పారు. సుస్థిర, సమగ్ర అభివృద్ధి కార్యాచరణను వరల్డ్ బ్యాంక్ బృందానికి ఏపీసీఆర్డీఏ అధికారులు వివరించనున్నారు. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పరిపాలనపై దృష్టి సారించనున్నారు. అంతర్జాతీయ సంస్థల సహకారంతో అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఏపీసీఆర్డీఏ అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై
అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ
Read Latest AP News And Telangana News And International News And Telugu News