Share News

వెలిగొండ నిర్వాసితులకు నేడు రూ.200 కోట్ల పరిహారం

ABN , Publish Date - Aug 19 , 2026 | 08:28 AM

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 1600 మందికి రూ.200 కోట్ల పరిహారం అందనుంది. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి చెక్కులు అందజేయనున్నారు.

వెలిగొండ నిర్వాసితులకు నేడు రూ.200 కోట్ల పరిహారం

అసెంబ్లీ ప్రాంగణంలో చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం

వారంలో మిగతా 400 కోట్లూ జమ

అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో 1600 మందికి రూ.200 కోట్ల పరిహారం అందనుంది. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారికి చెక్కులు అందజేయనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు సహాయ పునరావాసం కింద రూ.900 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం ఒకదఫా రూ.300 కోట్లు చెల్లించింది. మిగతా రూ.600 కోట్లతో రూ.200 కోట్లను బుధవారం కొందరికి చెల్లిసారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే నిర్వాసితులందరికీ మొత్తం పరిహారం చెల్లిస్తామని నిర్వాసితులకు ముఖ్యమంత్రి వాగ్దానం చేశారు.


ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారం రోజుల్లోనే మిగిలిన రూ.400 కోట్లను నిర్వాసితులకు చెల్లించాలని ఆర్థిక శాఖను ఆయన ఆదేశించారు. మూడు దశాబ్దాల కల నెరవేరబోతోందని ప్రకాశం, మార్కాపురం జిల్లాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందే పరిహారం చేతికి చేరనుందని నిర్వాసితులు హర్షిస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

55కు పైగా అజెండా అంశాలతో ఏపీ క్యాబినెట్ భేటీ

నిర్మలా సీతారామన్ నాయకత్వంలో భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది: పవన్

స్థానిక ఎన్నికలపై మాధవ్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 19 , 2026 | 08:28 AM