గిరిజన సమాజం మన దేశ గుర్తింపులో అంతర్భాగం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Mar 08 , 2026 | 08:24 AM
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సంతల్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సంతల్ సమాజం సంస్కృతి భాగస్వామ్యం, గౌరవాన్ని కొనసాగించాలని సూచించారు.
అమరావతి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో సంతల్ సమావేశంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా డిప్యూటీ సీఎం ట్వీట్ పెట్టారు. సంతల్ సమాజం సంస్కృతి భాగస్వామ్యం, గౌరవాన్ని కొనసాగించాలని సూచించారు.
సంతల్ సమాజ సభ్యుల సమావేశానికి అంతరాయం ఏర్పడటం విచారకరమని పేర్కొన్నారు. సంతల్ సమావేశాలు సమగ్రత, సున్నితత్వం, ప్రణాళికను ప్రతిబింబించాలని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి పర్యటన గౌరవంగా నిర్వహించాల్సిన బాధ్యత స్థానిక ప్రభుత్వానిదని సూచించారు. గిరిజన సమాజాలు మన దేశ గుర్తింపులో అంతర్భాగమని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పద్మావతి మహిళా యూనివర్సిటీ పరిశోధనలు అనేక జాతీయ సంస్థలకు ఉపయోగం: గవర్నర్ అబ్దుల్ నజీర్
విజయవాడలో కాల్పుల కలకలం.. పోలీసులు, ఈగల్ అధికారులపై ఫైరింగ్
Read Latest International News And Telangana News And AP News And Telugu News