ఎంపీలు టీడీపీ శ్రేణులతో మమేకమవ్వాలి.. మంత్రి లోకేశ్ దిశానిర్దేశం..
ABN , Publish Date - Jan 25 , 2026 | 08:59 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు గంట పాటు ఎంపీలతో లోకేశ్ విడిగా భేటీ అయ్యారు.
అమరావతి, జనవరి25 (ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి, నారా లోకేశ్ (Nara Lokesh) టీడీపీ ఎంపీలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు గంట పాటు ఎంపీలతో లోకేశ్ విడిగా భేటీ అయ్యారు. మంత్రులతో పాటు ఎంపీలు పార్టీ కేంద్ర కార్యాలయానికి తప్పనిసరిగా రావాలని హుకుం జారీ చేశారు. రాష్ట్ర మంత్రితో సమన్వయం చేసుకునేలా ప్రతీ ఎంపీకి కొన్ని శాఖలు అప్పగించామని స్పష్టం చేశారు. సంబంధిత శాఖా మంత్రి పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఆ మంత్రి శాఖలు కేంద్రంతో సమన్వయం చేసే ఎంపీ కూడా రావాలని సూచించారు.
ప్రజాదర్బార్‌లో ఇద్దరూ పాల్గొనటంతో పాటు శాఖాపరమైన అంశాలపై కేంద్రంతో సమన్వయం కోసం ఇద్దరూ చర్చించుకోవాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. రెండు సెషన్స్ కింద బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున మొదటి సెషన్ తర్వాత వచ్చే విరామం సమయంలో ప్రతీ ఎంపీతో వన్ టు వన్‌గా విషయాలపై మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం వద్ద పెండింగ్‌లోని ప్రతీ రాష్ట్ర సమస్యపై ఎంపీలు అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు.
నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ఎమ్మెల్యేల మధ్య బంధం మరింత బలపడేలా ఎంపీలు కృషి చేయాలని మంత్రి నారా లోకేశ్ కోరారు. ఎంపీల పనితీరుపై కేంద్రం నుంచి వస్తున్న నివేదికలు బాగున్నా పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాలని సూచించారు. పార్టీకి ఎక్కువ సమయం కేటాయిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మార్గనిర్దేశం చేశారు. కార్యకర్తలు సంతృప్తి చెందేలా వారి సమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎంపీలు కృషి చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి
బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Read Latest AP News And Telugu News