‘ఏపీ గ్రీన్’ చైర్మన్‌గా నాగబాబు
ABN , Publish Date - Aug 18 , 2026 | 08:49 AM
ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
క్యాబినెట్ హోదా కల్పించిన ప్రభుత్వం
డిప్యూటీ సీఎం పవన్ శుభాకాంక్షలు
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. 2047 నాటికి ఏపీ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ సుసంపన్నం కోసం ఏపీ గ్రీన్ సొసైటీకికార్యనిర్వాహక కమిటీ, జిల్లాస్థాయిలో జిల్లా హరిత అభివృద్ధి సంస్థల (డీజీడీఏ) పాలక మండళ్లను ఏర్పాటు చేసింది. ఏపీ గ్రీన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమితులైన నాగబాబుకు డిప్యూటీ సీఎం, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047లో భాగంగా ‘50 శాతం గ్రీన్ కవర్’ సాధించే లక్ష్యాన్ని నాగబాబు సమర్థవంతంగా నిర్వహిస్తారని ఆకాంక్షించారు.
అటవీ విస్తీర్ణం పెంపు, పునర్‌అటవీకరణ, పర్యావరణ పరిరక్షణ, హరితాంధ్ర నిర్మాణం వంటి కార్యక్రమాలు నాగబాబు నాయకత్వంలో మరింత వేగంగా, ఫలితాల దిశగా సాగుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ కీలక బాధ్యతలో ఆయన విజయవంతం కావాలన్నారు. నాగబాబును క్యాబినెట్ హోదాలో ఏపీ గ్రీన్ చైర్మన్‌గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మద్దతు తెలిపిన కూటమి పక్షాల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ గ్రీన్ సొసైటీ లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు.
పాలక మండలి ఏర్పాటు
హరితాంధ్రప్రదేశ్ సాధన కోసం ఏపీ గ్రీన్ సొసైటీకి పాలక మండలిని కూడా ప్రభుత్వం నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చింది. చైర్మన్‌గా డిప్యూటీ సీఎం/అటవీ శాఖ మంత్రి, ఉపాధ్యక్షుడిగా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్లుగా అటవీ, ఆర్థిక, పంచాయతీరాజ్, వ్యవసాయ, గిరిజన సంక్షేమ, విద్య, పరిశ్రమలు, రెవెన్యూ, జలవనరులు, ఆర్‌అండ్‌బీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పీసీసీఎఫ్, వివిధ శాఖల డైరెక్టర్లు, నాబార్డు సీజీఎం, ఎన్జీవోలను నియమించింది. అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీలో పలు శాఖల అధికారులను, జిల్లా స్థాయి హరిత అభివృద్ధి సంస్థలకు చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్లను నియమించింది.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News