గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామం: హోంమంత్రి అనిత
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:12 PM
గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. దీని ద్వారా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
బాపట్ల, అక్టోబర్ 8: గుంటూరు ఛానల్‌ను పర్చూరుకు పొడిగించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. దీని ద్వారా 28 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈరోజు(గురువారం) పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన హోంమంత్రి.. రూ.75 కోట్ల నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో ఉన్నా సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి సీఎం 24 గంటల పాటు పని చేస్తున్నారన్నారు. గత గొడ్డలి పార్టీ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.
చంద్రబాబు ఇచ్చిన డీఎస్సీలోనే తాను కూడా ఉపాధ్యాయురాలిని అయ్యానని హోంమంత్రి అన్నారు. గంజాను తరిమికొట్టాలని ఈగల్ టీంను ఏర్పాటు చేశామన్నారు. చాలా మంది తల్లులు తమ పిల్లలు గంజాయికి అలవాటుపడ్డారని ఫోన్లు చేస్తున్నారని.. వారి కోసం రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. గొడ్డలి పార్టీ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి, భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నెల్లూరులో 15 ప్రభుత్వ హైస్కూళ్ల ఆధునికీకరణ: మంత్రి నారాయణ
ఏపీలో పెట్టుబడులే లక్ష్యం.. ఎంఓయూలను సాకారం చేస్తాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News