Share News

తెలుగు రాష్ట్రాల జల వివాదం.. సీడబ్ల్యూసీ సమక్షంలో కొత్త అభ్యంతరాలు..

ABN , Publish Date - Jan 30 , 2026 | 09:40 PM

ఏపీ, తెలంగాణ ఇరిగేష‌న్ అధికారుల‌తో సీడ‌బ్ల్యూసీ చైర్మన్ స‌మ‌క్షంలో తెలుగు రాష్ట్రాల మొద‌టి జ‌ల‌ వివాద‌ల క‌మిటీ స‌మావేశం ముగిసిందని ఏపీ ఇరిగేష‌న్ అడ్వైజ‌ర్ వెంక‌టేశ్వర‌రావు తెలిపారు. సీడ‌బ్ల్యూసీ త‌మ నివేదిక‌ను పీపీటీ రూపంలో కేంద్ర జ‌ల‌సంఘం అధికారులు ప్రెజెంటేష‌న్ చేశారని వెల్లడించారు..

తెలుగు రాష్ట్రాల జల వివాదం.. సీడబ్ల్యూసీ సమక్షంలో కొత్త అభ్యంతరాలు..
Telugu States Water Disputes

ఢిల్లీ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ఏపీ, తెలంగాణ ఇరిగేష‌న్ అధికారుల‌తో సీడ‌బ్ల్యూసీ చైర్మన్ స‌మ‌క్షంలో తెలుగు రాష్ట్రాల మొద‌టి జ‌ల‌వివాదాల పరిష్కార క‌మిటీ స‌మావేశం ముగిసిందని ఏపీ ఇరిగేష‌న్ అడ్వైజ‌ర్ వెంక‌టేశ్వర‌రావు తెలిపారు. సీడ‌బ్ల్యూసీ త‌మ నివేదిక‌ను పీపీటీ రూపంలో కేంద్ర జ‌ల‌ సంఘం అధికారులు ప్రెజెంటేష‌న్ చేశారని వెల్లడించారు. ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల మొద‌టి జ‌ల‌ వివాద‌ల క‌మిటీ స‌మావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఏపీ ఇరిగేష‌న్ అడ్వైజ‌ర్ వెంక‌టేశ్వర‌రావు మీడియాకు వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన‌ అజెండాను పీపీటీ రూపంలో కేంద్ర జ‌ల‌సంఘం అధికారులు వివ‌రించారని తెలిపారు. తెలంగాణ అధికారులు ఎలాంటి అజెండా ఇవ్వనందున.. వారినే సీడ‌బ్ల్యూసీ చైర్మన్ వివ‌రించ‌మ‌ని చెప్పారని పేర్కొన్నారు. పోల‌వ‌రం - బ‌న‌క‌చ‌ర్ల లింక్ ప్రాజెక్ట్‌కు వ‌ర‌ద జ‌లాల‌తో వినియోగించుకునేలా ఎలా అనుమ‌తులు ఇస్తారంటూ తెలంగాణ ప్రతినిధులు ప్రశ్నించారని అన్నారు. ఎగువ రాష్ట్రాలు వారి హ‌క్కుల ప్రకారం వినియోగించుకున్న త‌ర్వాతే.. పోల‌వ‌రం నుంచి స‌ముద్రంలో వృథాగా క‌లిసిపోయే మిగులు జ‌లాల‌తోనే రూపొందించామ‌ని ఏపీ అధికారులు స్పష్టం చేశారని తెలిపారు.


వృథాగా పోయే జలాలను ఏపీ వినియోగించుకుంటే త‌ప్పేంట‌ని తెలంగాణ ప్రతినిధుల‌ను సీడ‌బ్ల్యూసీ చైర్మన్ ప్రశ్నించారని అన్నారు. ఏపీ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామ సాగ‌ర్ ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇచ్చిన‌ప్పుడు లేని వివాదం, ఇప్పుడు బ‌న‌క‌చ‌ర్ల విష‌యంలో ఎందుకని ఏపీ అధికారులు ప్రశ్నించారని తెలిపారు. ప్రస్తుత‌ కేటాయింపులు 66:34 నిష్పత్తికి బ‌దులుగా 50:50 నిష్పత్తిలో కృష్ణా జ‌లాల‌ను ఈఏడాది నుంచే పంచాలని తెలంగాణ ప్రతినిధులు కోరారని అన్నారు. ఇది కృష్ణా జ‌ల‌ వివాదాల ట్రెబ్యున‌ల్, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల‌కు వ్యతిరేకంగా ఉండటంతో సాధ్యం కాద‌ని ఏపీ అధికారులు చెప్పారని తెలిపారు. వారం గ‌డువు ఇస్తే త‌మ అజెండాను సీడ‌బ్ల్యూసీకి నివేదిస్తామ‌ని తెలంగాణ ప్రతినిధులు చెప్పారని ఏపీ ఇరిగేష‌న్ అడ్వైజ‌ర్ వెంక‌టేశ్వర‌రావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కుట్రలు చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్

దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 09:48 PM