Share News

ఏపీలో సర్ గడువు పొడిగింపు.. అక్టోబర్ 9న తుది జాబితా

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చేసిన అభ్యర్థన మేరకు ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది.

ఏపీలో సర్ గడువు పొడిగింపు.. అక్టోబర్ 9న తుది జాబితా
AP SIR 2026

అమరావతి, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (CEO) చేసిన అభ్యర్థన మేరకు ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు సెప్టెంబర్ 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది.


ఓటర్ల జాబితాలో పేర్లు, వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉన్నా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోయినా ఈ గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేయవచ్చని అధికారులు తెలిపారు. అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు అక్టోబర్ 5వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.


ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 9వ తేదీన తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించి ఈ తేదీలు మారాయి.


సవరించిన ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ను వెంటనే రాష్ట్ర గెజిట్‌లో ప్రచురించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అలాగే షెడ్యూల్‌లో చేసిన మార్పులపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సూచించింది.

ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. పేరులో తప్పులు, చిరునామా మార్పులు లేదా ఇతర వివరాల్లో సమస్యలు ఉంటే నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు సమర్పించి సవరించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్

రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 01 , 2026 | 06:03 PM