Share News

తెలుగు సినీ రంగానికి కృష్ణ సేవలు చిరస్మరణీయం: లోకేశ్

ABN , Publish Date - May 31 , 2026 | 05:00 PM

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను స్మరించుకున్నారు.

తెలుగు సినీ రంగానికి కృష్ణ సేవలు చిరస్మరణీయం: లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను స్మరించుకున్నారు. ధైర్యమే శ్వాసగా భావించి.. చాలా సాహసోపేతమైన ప్రయోగాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణ రికార్డులు సృష్టించారని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా రంగంలో కొత్త సాంకేతికతలు, వినూత్న కథాంశాలతో ప్రేక్షకులను కృష్ణ అలరించారని పేర్కొన్నారు


నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా కృష్ణ విశేష గుర్తింపు పొందారని లోకేశ్ కొనియాడారు. వెండితెరపై ఆయన వేసిన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రశంసించారు. అనేక విజయవంతమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ చెరగని స్థానం సంపాదించారని కీర్తించారు. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచే మహానటుడని చెప్పుకొచ్చారు. తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి కృష్ణ చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విజయవాడలో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్..!

పోలీసులపై దాడులు సహించం.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం: అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 06:06 PM