Atchannaidu: రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్.. అచ్చెన్నాయుడు ఫైర్
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:38 PM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ, సాక్షి మీడియా చేస్తోన్న తప్పుడు ప్రచారంపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి అచ్చెన్నాయుడు (AP Minister Kinjarapu Atchannaidu). రాయలసీమకు ద్రోహం చేసిందే జగన్ అని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వైసీపీ నేతల విమర్శలకు ధీటుగా ఏపీ మంత్రులు సమాధానం ఇచ్చారు. వైసీపీ, సాక్షి మీడియా చేస్తోన్న తప్పుడు ప్రచారంపై దుయ్యబట్టారు. జగన్ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
2020లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయిందని తేల్చిచెప్పారు. వైసీపీ హయాంలోనే ఎవరో ఎన్జీటీకి వెళ్తే స్టే ఇచ్చిందని ప్రశ్నించారు. ఈరోజు తాము ఆపామంటూ వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎవరి స్వార్థం కోసం వారు మాట్లాడుకుంటున్నారని విమర్శలు చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై వాస్తవాలను ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగినట్లుగా ఒక్క ఆధారమైన చూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తమకు ఉన్న రిలేషన్ వేరని, ఏపీ ప్రయోజనాలు వేరని క్లారిటీ ఇచ్చారు. రిలేషన్ కోసం ఏపీ ప్రయోజనాలను తాము ఎప్పుడూ పణంగా పెట్టమని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
రాయలసీమ అభివృద్ధికి కృషి: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

రాయలసీమ ద్రోహి ఎవరనే విషయం ప్రజలంతా తెలుసుకున్నారని ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ రాయలసీమకు చేసిన ద్రోహం గురించి ప్రజలు తెలుసుకునే కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. జగన్ రాయలసీమ వాసులకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. జగన్ రాయలసీమకు అన్యాయం చేయడంతోనే కూటమికి అక్కడ ఎక్కువగా సీట్లు వచ్చాయని తెలిపారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆత్మనిర్భర్ భారత్‌లో మరో కీలక మైలురాయి: సీఎం చంద్రబాబు
పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో వేశారు.. హోంమంత్రి ఫైర్
Read Latest AP News And Telugu News