Share News

అమరావతిలో క్వాంటం వ్యాలీతో నూతన అధ్యాయానికి శ్రీకారం: మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - Feb 07 , 2026 | 01:06 PM

ఏపీ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో భవిష్యత్తు ప్రపంచ టెక్నాలజీకి అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కానుందని పేర్కొన్నారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీతో నూతన అధ్యాయానికి శ్రీకారం: మంత్రి జనార్దన్ రెడ్డి
AP Minister BC Janardhan Reddy

అమరావతి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణంతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(AP Minister BC Janardhan Reddy) వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో భవిష్యత్తు ప్రపంచ టెక్నాలజీకి అమరావతి క్వాంటం వ్యాలీ వేదిక కానుందని పేర్కొన్నారు. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీ మన రాష్ట్రంలో ఏర్పాటు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. శనివారం అమరావతిలోని క్వాంటం వ్యాలీ సెంటర్ వేదికగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.


సరికొత్త చరిత్ర..

హైటెక్ సిటీతో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన విజనరీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో..  క్వాంటం వ్యాలీతో నవ్యాంధ్ర సరికొత్త చరిత్రను లిఖించబోతోందని మంత్రి చెప్పుకొచ్చారు. గ్లోబల్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం అమరావతి క్వాంటం వ్యాలీ అని ఉద్ఘాటించారు. భవిష్యత్తులో నవ్యాంధ్ర ఆర్థిక వ్యవస్థకు ఇది బలమైన వెన్నెముకగా మారనుందని వివరించారు. రానున్న కాలంలో రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనలో క్వాంటం టెక్నాలజీ గేమ్ ఛేంజర్‌గా నిలవనుందన్నారు. ప్రపంచస్థాయి ఐటీ దిగ్గజ సంస్థలను ఒప్పించి, అమరావతికి తీసుకురావడంలో.. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కృషి అభినందనీయమని ప్రశంసించారు. అమరావతిని గ్లోబల్ టెక్నాలజీ మ్యాప్‌లో నిలబెట్టే క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ వెనుక ఆయన పాత్ర మరువలేనిదని జనార్దన్ రెడ్డి కొనియాడారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో లక్షల్లో కుచ్చుటోపీ

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 01:54 PM