ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Aug 22 , 2026 | 06:14 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్-2026ను విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 81ను జారీ చేసింది. ఏపీలో జాబ్ క్యాలెండర్-2026కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్-2026ను విడుదల చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 81ను జారీ చేసింది. ఏపీలో జాబ్ క్యాలెండర్-2026కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 10,060 ఖాళీల భర్తీకి జీవో విడుదల చేసింది. నాలుగు దశల్లో ప్రత్యక్ష్య నియామకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. ఫేజ్-1లో ఇప్పటికే 1,523 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 15వ తేదీన ఫేజ్-2లో 3,231 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అక్టోబర్ 15వ తేదీన ఫేజ్-3లో 2,311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. అక్టోబర్ 15వ తేదీన ఫేజ్-4లో 2,995 పోస్టుల నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఈ మేరకు ఏపీపీఎస్పీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, డీఎస్పీ ద్వారా నియామకాలు చేపట్టనుంది. ఫేజ్-2లో 149 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనుంది. ఫేజ్-2లో డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. అలాగే, ఫేజ్-2లో 542 కానిస్టేబుల్, 182 ఎస్‌ఐ పోస్టులు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ - 196 పోస్టులను భర్తీ చేయనుంది. ఫేజ్-3లో 200 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులకు నియామకాలు చేపట్టనుంది.
ఫేజ్-3లో 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు, నీటి వనరుల శాఖలో 224 AEE పోస్టులు, విద్యుత్ సంస్థల్లో 629 AEE పోస్టులను రిక్రూట్ చేయనుంది. అలాగే, ఫేజ్-4లో డీఎస్సీ ద్వారా 2,991 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు రిజర్వేషన్లు, రోస్టర్ విధానం ప్రకారం నియామకాలు ఉంటాయని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
వార్తలు కూడా చదవండి...
హరీశ్‌రావు కాదు.. అబద్దాల రావు.. మంత్రి పొంగులేటి సెటైర్లు
ఆ భూములను లాక్కుంటే.. చూస్తూ ఊరుకోం.. రేవంత్ సర్కార్‌కు కవిత వార్నింగ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News