ఏపీలో నామినేషన్ల గడువు పొడిగిస్తారా.? ఎస్‌ఈసీ నిర్ణయంపై ఉత్కంఠ
ABN , Publish Date - Oct 22 , 2026 | 06:33 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా, ఐజీ రాజకుమారి గురువారం విజయవాడలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. న్యాయ నిపుణులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.
విజయవాడ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనిల్ చంద్ర పునేఠా, ఐజీ రాజ కుమారి ఈరోజు (గురువారం) విజయవాడలో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. న్యాయ నిపుణులతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. నామినేషన్ల గడువు పొడిగింపు అంశంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అంశంలో ఎస్‌ఈసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, మార్కాపురం జిల్లాల నుంచి ఎస్ఈసీ ఈరోజు ఉదయం నివేదికలు కోరారు. నామినేషన్ల దాఖలు అంశానికి సంబంధించి 7 జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. నామినేషన్ల దాఖలుకు ఎదురైన ఆటంకాలు, అడ్డంకులు, ఫిర్యాదులను జిల్లాల నుంచి తెప్పించుకుని పరిశీలించారు. ఆయా నివేదికల ఆధారంగా న్యాయ సలహా తీసుకొని సరైన నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశం అనంతరం ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా తీసుకునే తాజా నిర్ణయంపై ఉత్కంఠత నెలకొంది.
ఇవి కూడా చదవండి...
విశాఖలో రోడ్డు ప్రమాదం.. గాయపడిన విద్యార్థులకు హోంమంత్రి అనిత సాయం
నకిలీ వాట్సాప్ నిర్వాహకులకు పవన్ కల్యాణ్ కార్యాలయం హెచ్చరిక
Read Latest AP News And Telugu News